తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐపీఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన ప్రకారం పోలీస్ శాఖలో విస్తృత స్థాయిలో మార్పులు చేపట్టింది. డీజీపీ తెలంగాణ నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు ఈ బదిలీలు, పోస్టింగ్‌లు అమల్లోకి వచ్చాయి. పోలీస్ విభాగంలో పరిపాలన, ట్రాఫిక్, ఇంటెలిజెన్స్, విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్, సీఐడీ తదితర కీలక విభాగాల్లో మార్పులు చోటు చేసుకు న్నాయి. అనుభవజ్ఞులైన సీనియర్ ఐపీఎస్ అధికా రులతో పాటు యువ అధికా రులకు కూడా ప్రాధాన్య పోస్టింగ్‌లు కల్పిస్తూ ప్రభు త్వం నిర్ణయం తీసు కుంది.
జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్), సైబరాబాద్‌గా పనిచేస్తున్న డాక్టర్ గజరావు భూపాల్‌ను ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ప్రొవిజనింగ్ & లాజిస్టిక్స్‌గా నియమించారు. అదనంగా ఆయనకు ఐజీ ఆఫ్ పోలీస్, స్పోర్ట్స్ & వెల్ఫేర్ విభాగానికి పూర్తి అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. తెలంగాణ నార్కోటిక్స్ యాంటీ-బ్యూరో డీఐజీగా ఉన్న అభిషేక్ మొహంతిను విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఐజీగా నియమించారు. అలాగే ఇంటెలిజెన్స్ సీఐ సెల్‌లో ఎస్పీగా ఉన్న ఆర్. భాస్కరన్‌ను డీఐజీ, సీఐ సెల్, ఇంటెలిజెన్స్‌గా పదోన్నతితో పోస్టింగ్ ఇచ్చారు. రైల్వేస్ పోలీస్ విభాగంలో పనిచేస్తున్న జి. చందన దీప్తిను ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌లో అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (అడ్మిన్ & ట్రాఫిక్)గా నియమించారు.
విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీగా ఉన్న టి. అన్నపూర్ణను సైబరాబాద్ డీసీపీ (అడ్మిన్)గా బదిలీ చేశారు.హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ విభాగం లోనూ కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. డీసీపీ ట్రాఫిక్‌గా ఉన్న బి.కె. రాహుల్ హెగ్డే కు ట్రాఫిక్-III విభాగం (చార్మినార్, రాజేంద్రనగర్, శంషాబాద్ ఎల్&ఓ జోన్‌లు కలిపి) బాధ్యతలు అప్పగించారు. ఎస్‌బీ డీసీపీగా ఉన్న కె. అపూర్వ రావును ఇంటెలిజెన్స్ ఎస్పీగా నియమించారు. ఈస్ట్ జోన్ డీసీపీగా పనిచేస్తున్న బి. బాలా స్వామిను విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీగా నియమించగా, ట్రాఫిక్-III డీసీపీగా ఉన్న ఆర్. వెంకటేశ్వర్లును సీఐడీ ఎస్పీగా పోస్టింగ్ చేశారు. సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ ఎస్. చైతన్య కుమార్‌ను హైదరాబాద్ సిటీ క్రైమ్స్/డీడీ డీసీపీ బాధ్యతలు అప్పగించారు.
యువ ఐపీఎస్ అధికారులకు కూడా కీలక ట్రాఫిక్ పోస్టింగ్‌లు ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్ ఎస్పీగా ఉన్న అవినాష్ కుమార్‌ను హైదరాబాద్ ట్రాఫిక్-I డీసీపీగా నియమించారు. ఉట్నూర్‌లో అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్న కాజల్‌ను ట్రాఫిక్-II డీసీపీగా నియమించారు. జగిత్యాల అడ్మిన్ అడిషనల్ ఎస్పీగా ఉన్న శేషాద్రిని రెడ్డిను సైబరాబాద్ ట్రాఫిక్-II డీసీపీగా పోస్టింగ్ చేశారు. భువనగిరి అడిషనల్ ఎస్పీగా ఉన్న కంకనాల రాహుల్ రెడ్డిను మల్కాజిగిరి కమిషనరేట్ ట్రాఫిక్-I డీసీపీగా నియ మించగా, ములుగు నుంచి శివం ఉపాధ్యాయను ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ డీసీపీగా బదిలీ చేశారు.
రాచకొండ నుంచి శ్రీనివాసులు, జె. రంజన్ రతన్ కుమార్, కె. శ్యామ్ సుందర్‌లకు కూడా హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ కమిషనరేట్లలో కీలక బాధ్యతలు అప్ప గించారు. విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో అదనపు ఎస్పీగా ఉన్న పి. అశోక్‌ను అదే విభాగంలో కొనసాగిస్తూ, ఎ. బాలకోటిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ బదిలీలతో తెలంగాణ పోలీస్ శాఖలో పరిపాలనా సామర్థ్యం మరింత మెరుగవుతుందని, ముఖ్యంగా ట్రాఫిక్ నియంత్రణ, ఇంటెలిజెన్స్ సేకరణ, విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు మరింత పటిష్టంగా అమలవుతాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. గవర్నర్ ఆదేశాల మేరకు ఈ ఉత్తర్వులను చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణ రావు జారీ చేశారు.