చప్పట్లు, దీపాలు, పూలు! ఇప్పడు తీర్థంలా మద్యం!
posted on May 5, 2020 @ 11:16AM
''గంటలు మోగించారు! చప్పట్లు కొట్టారు! దీపాలు వెలిగించారు... పై నుంచి పూలు చల్లారు...ఇకపై తీర్థం ఇస్తున్నట్లుగా మద్యం అమ్మకాలు ప్రారంభించారు'' అని సెటైర్ వేశారు సీపీఐ రాష్ట్ర రామకృష్ణ. రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరవడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో మద్యం అమ్మకాలపై పునరాలోచన చేయాలని అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోసం తాపత్రయపడుతోందా అని ఆయన ప్రశ్నించారు?
కేంద్ర ప్రభుత్వం బుక్‌స్టాల్స్‌కు అనుమతులివ్వగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వైన్ షాపులకు మాత్రమే అనుమతి ఇచ్చి పుస్తకాల షాపులకు ఎందుకు ఇవ్వలేదని ఆయన ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు.
మద్యం షాపుల వద్ద లాక్‌డౌన్ నిబంధనలు పాటించడం లేదని ఆయన ఆరోపించారు. వ్యక్తిగత దూరం గాని కనీసం మాస్కులు కూడా లేకుండా మందుబాబులు బారులు తీరి లైన్లో నిల్చున్నారని అన్నారు. పోలీసుల బందోబస్తు మధ్య మద్యం అమ్మకాలు సాగించాల్సిన తొందర దేనికని, ఇలాంటి దుస్థితి నెలకొనడం విచారకరమని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.