Read more!

మనీష్ సిసోడియా ఈడీ కస్టడీ పొడగింపు

ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కస్టడీని కోర్టు మరో ఐదు రోజుల పాటు పొడిగించింది. మనీష్ సిసోడియా ఈడీ కస్టడీ శుక్రవారంతో ముగియనుండగా ఈడీ ఆయనను కోర్టులో హాజరు పరిచింది.

కస్టడీ పొడిగించాల్సిందిగా కోరింది. కోర్టు ఆయనను మరో ఐదు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 22న కోర్టు కోర్టులో హాజరు పరచాల్సిందిగా ఈడీని ఆదేశించింది. మద్యం కుంభకోణంలో సిసోడియాను ఈడీ ఈ నెల 9న ఈడీ అరెస్టు చేసిన సంగతి విదితమే. కాగా ఇదే కేసులో సీబీఐ మనీష్ సిసోడియాను గత నెల 26న అరెస్టు చేసింది.

 అప్పటి నుంచి ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. మార్చి 6 వరకు ఆయన సీబీఐ కస్టడీలో ఉండగా, ఆ తర్వాత ఆయనకు జ్యుడిషియల్ కస్టడీ విధించారు.  ఇటీవల ఈడీ అరెస్ట్ నేపథ్యంలో, మార్చి 10న ఈడీ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.