సర్కారు సర్కస్‌ఫీట్లు ` తనిఖీలు ఆరంభశూరత్వమే!
posted on Oct 5, 2012 8:52AM
ఎన్నెన్నో కబుర్లు చెప్పారు... కార్పొరేట్ కాలేజీల నడ్డి వంచేస్తామన్నారు... ఇంజనీరింగ్ కాలేజీల భరతం పట్టేస్తామన్నారు... పేదవిద్యార్థికి క్వాలిటీ చదువును కడు చౌకగా ఇప్పిస్తామన్నారు...! ఇదంతా చూసి ‘అబ్బో... కిరణ్ సర్కారు కార్పొరేట్ కాలేజీల దందాగిరీపై కొరడా రaళిపించింది... ఇక కార్పొరేట్ కాలేజీలు ఆయ్‌మాయ్‌గారడీలు చెయ్యకుండా నాణ్యమైన చదువును ఖచ్చితంగా అందిస్తాయంటూ ‘పాపం అమాయక తల్లిదండ్రులు’ తెగ సంతోషపడిపోయారు! వారి సంతోషంపై నీళ్ళుజల్లేస్తూ తనిఖీలకు తిలోదకాలిచ్చేసింది అవినీతి ఆరోపణలతో సంచలనం సృష్టిస్తూ, ఘనతవహిస్తున్న కిరణ్‌సర్కార్! ‘ఇదంతా మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణలను కాస్సేపు మర్చిపోయేటట్లుగా చెయ్యడంకోసమేనన్నట్లని’ నిరూపిస్తూ కిరణ్ ప్రభుత్వం ఇంత కథ నడిపించిందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఫీజులవివాదంతో టాస్క్‌ఫోర్సును హడావిడిగా ఏర్పాటుచేసి, దాన్ని సుమారు గత నాలుగునెలలుగా పోషిస్తూ, భారీమొత్తాన్ని వెచ్చిస్తున్న సర్కార్, తనిఖీల అంశాన్ని అటకెక్కించగంతో ఖర్చుపెట్టిన ఈమొత్తమంతా బూడిదలో పోసినట్లయ్యింది. సర్కారువారి టాస్క్‘ఫార్స్’ ఎత్తుగడతో ధర్మాన రాజీనామా అంశం, మంత్రులపై అవినీతి ఆరోపణలు, సిబిఐ కేసులు... అన్నీ నిజంగానే పక్కదారిపట్టినట్టనిపిస్తోందని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.