కరోనా ముప్పు పల్లెలకు సోకింది
posted on Sep 7, 2020 @ 3:30PM
కరోనా మహమ్మారి పట్టణాలను వదిలి గ్రామల మీద ప్రతాపం చూయిస్తోంది. భారతదేశంలో ప్రస్తుతం నమోదు అవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో ఎక్కువ శాతం గ్రామాల్లోనే వస్తున్నాయి. దేశంలో మొత్త కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నలభై లక్షల కు చేరువలో ఉంది. అసుపత్రి సదుపాయాలు సరిగ్గా లేని గ్రామాల్లో ఈ వైరస్ తన ప్రభావం చూపిస్తోంది. హౌ ఇండియా లివ్స్ వెబ్ సైట్ చేసిన సర్వేలో దాదాపు 94శాతం గ్రామీణ ప్రాంతాల వారు కరోనా బారిన పడ్డారని తెలుస్తోంది. దేశంలోని 714జిల్లాల్లో కరోనా సోకిందని ఈ సర్వే ఫలితాలు చెప్తున్నాయి. ప్రభుత్వాలు ప్రకటించే సంఖ్యలో మాత్రం వాస్తవాలు కనిపించడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వ్యాపిస్తే పరిస్థితులు ఆందోళన కరంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పిల్లల నుంచే ఎక్కువగా..
కరోనా వ్యాప్తికి కారణాలను అన్వేషిస్తున్న పరిశోధకులు చెప్తున్న విషయాలు ఆశ్చర్యంగా ఉంటున్నాయి. కోవిద్ 19 వైరస్ పిల్లలకు సోకినా వారిలో అంతగా లక్షణాలు కనిపించవి అయితే వారి ద్వారా ఇతరులకు వ్యాపిస్తుందని చెప్తున్నారు. పిల్లలు సరైనా మాస్కులు లేకుండా గుంపులుగా ఆట పాటల్లో నిమగ్నమవుతున్నారు. టీనేజ్ పిల్లల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటంతో వారిలో కరోనా వైరస్ పెద్దగా ప్రభావం ఉండదు. లక్షణాలు కూడా బయటకు కనిపించవు. అయితే వారి ద్వారా పెద్దలకు వైరస్ సోకుతుందని ‘ది జర్మన్ సొసైటీ ఫర్ వైరాలోజీ’ తాజాగా హెచ్చరించింది. స్పెయిన్‌లో కరోనా వైరస్ సోకినా 60 వేల మందిపై యాండీ బాడీస్ పరీక్షలు నిర్వహించగా, వారిలో 3.4 శాతం పిల్లలు ఉన్నారని, వారందరిలో యాంటీ బాడీస్ అభివృద్ది చెందినట్లు గుర్తించారు. లక్షణాలు కనిపించలేదని అజాగ్రత్త చేయవద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.