భారత్ లో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులివే
posted on Jun 9, 2020 @ 10:37AM
భారత్‌లో రోజుకి 9 వేలకు పైగా కరోనా కేసులు నమోదవ్వడం సాధారమైపోయింది. గత 24 గంటల్లో దేశంలో 9,987 మందికి కరోనా పాజిటివ్ గా తేలిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. గత 24 గంటల్లో కరోనాతో 331 మంది మరణించారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,66,598కి చేరగా, మృతుల సంఖ్య 7,466కి చేరుకుంది. కరోనా నుంచి కోలుకొని ఇప్పటివరకు 1,29,215 మంది డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 1,29,917 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 49,16,116 కరోనా టెస్ట్‌లు చేసినట్టు కేంద్రం ప్రకటించింది. గడిచిన 24 గంటల్లోనే 1,41,682 టెస్టులు నిర్వహించారు. ఇక, దేశంలో కరోనా రికవరీ రేటు 49 శాతంగా ఉంది.