షాకింగ్.. ఏపీలో ఒకే రోజు 8 వేల కరోనా కేసులు
posted on Jul 23, 2020 @ 6:38PM
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. ఒకేరోజు దాదాపు 8 వేల కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 58,052 మందికి కరోనా పరీక్షలు చేయగా 7,998 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1391 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 1184, అనంతపురం జిల్లాలో 1016 కేసులు, కర్నూలు జిల్లాలో 904 కేసులు, పశ్చిమ గోదావరి జిల్లాలో 748 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 72,711 చేరింది. గడిచిన 24 గంటల్లో 61 మంది కరోనాతో మరణించారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 884 మంది మృతి చెందారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 34,272గా ఉంది.