కరోనా విజృంభణ.. ఆందోళనలో ప్రపంచ దేశాలు

కరోనాపై మానవాళి విజయం అంటూ ప్రకటించి... ఇక మాస్కులు ధరించనవసరం లేదని ప్రపంచ ఆరోగ్య శాఖ చెప్పడం ఎంత తప్పిదమో ఇప్పుడు అర్ధమౌతోంది. కరనో మహమ్మారిపై జయంచేశామని  నిర్లక్యంగా వ్యవహరిస్తున్న వేళ చైనాలో మళ్లీ మొదలై ప్రపంచ దేశాలను చుట్టేయడానికి కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచం అంతా కరోనా నుంచి విముక్తి  పొందామని భావిస్తున్న వేళ చైనాలో  మహమ్మారి మళ్లీ కోరలు సాచింది.

అక్కడ నుంచి జపాన్, కొరియా దేశాలకు విస్తరించింది. భారత్ లోనూ అడుగుపెట్టింది. స్వల్ప వ్యవధిలోనూ ప్రపంచాన్ని చుట్టేస్తుందన్న ఆందోళన వ్యక్తమౌతుంది. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం వచ్చే 90 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 10 శాతం మంది జనాభాకు కోవిడ్ సంక్రమించే అవకాశం ఉంది.

 ఇక భారత్ విషయానికి వస్తే ఇప్పటి వరకూ జీరో కోవిడ్ పరిస్థితి  లేకపోగా కొత్తగా 112 కేసులు నమోదయ్యాయి. 3,490 కేసులు యాక్టివ్ కేసులు ఉన్నాయి.   ఈనేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యలను చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది.