మళ్లీ మహమ్మారి విజృంభణ.. బూస్టర్ డోసు కొరతతో జనం ఆందోళన
posted on Dec 29, 2022 @ 5:04PM
కోవిడ్ మహమ్మారి మరో సారి భారత్ పైనా పంజా విసిరేందుకు సిద్ధమౌతోందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ భారత్ లో వచ్చే 40 రోజులూ అత్యంత కీలకమనీ, జనవరిలో కోవిడ్ కేసులు గణనీయంగా పెరిగే అవకాశం ఉందనీ హెచ్చరించింది. ఈ హెచ్చరికే ఇప్పుడు భారత్ లో బూ
స్టర్ డోస్ వేసుకోని వారిలో ఆందోళన నింపుతోంది.
బూస్టర్ వ్యాక్సిన్ తప్పని సరిగా వేయించుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెవినిల్లు కట్టుకుని పోరినా అత్యధికులు నిర్లక్ష్యం చేశారు. దీంతో దేశం మొత్తంలో బూస్టర్ డోస్ వేసుకున్న వారి సంఖ్య కనీసం ఒక శాతం మించలేదు. దీంతో భారత్వ్యాక్సినేషన్ విషయంలో ఇతర దేశాల కంటే వెనుకబడి ఉంది. గత జూలైలోని కేంద్రం 75 రోజుల పాటు బూస్టర్ డోస్ వేయించుకునే వారికి ఉచితంగా వ్యాక్సినేషన్ ప్రకటించింది. అయినా పాతిక శాతం మంది కూడా వ్యాక్సినేషన్ వేయించుకునేందుకు ముందుకు రాలేదు. కరోనా మమమ్మారి విజృంభణ నేపథ్యంలో దేశంలో మొదటి రెండు డోసుల వ్యాక్సినేషన్ విషయంలో దేశంలో ప్రజలంతా స్వచ్చందంగా ముందుకు కదిలారు. తొలి రెండు డోసులూ వేసుకున్నవారి శాతం 95 శాతం మించింది. 12 ఏళ్ల లోపు పిల్లల్లో కూడా 95 శాతం మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.
అయితే మూడో డోసు విషయానికి వచ్చే సరికి మాత్రం జనం మాత్రం వెనుకంజ వేశారు. 60 ఏళ్లు పైబడిన వారు బూస్టర్ డోసు వేయించుకున్నారు కానీ, అంతకంటే తక్కువ వయసు వారు మాత్రం బూస్టర్ డోసు పట్ల ఏమాత్రం ఆసక్తి చేపలేదు. ఇప్పుడు మరోసారి మహమ్మారి వ్యాప్తి వార్తల నేపథ్యంలో జ.నం బూస్టర్ డోస్ కోసం ఆసుపత్రులకు పోటెత్తుతున్నారు. కానీ వ్యాక్సిన్ కొరత వేధిస్తోంది.