భారత్ లోనే మరో రెండు డ్రగ్స్
posted on Apr 28, 2020 @ 10:56AM
ప్రపంచంలోని శాస్త్రజ్ఞులంతా కూడగట్టుకుని కరోనా మహమ్మారి పీడ వదిలించేందుకు మందో మాకో కనిపెట్టే మహాయజ్ఞంలో తలమునకలై ఉండగా ఈ రక్కసిపై భారత్ మరో అస్త్రాన్ని సంధించింది.. మరో రెండు మందులు కరోనా ఉద్వాసనకు అమృతంలా పని చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని భారత్ లోని Task force for repurposing drugs(TFORD) వెల్లడించింది. జపాన్ లో ఇప్పటికే సత్ఫలితాలు ఇస్తున్న faviparivar తో పాటు రోగ నిరోధక శక్తిని పెంపొందించే TOZILIZUMAB కూడా covid చికిత్సకు వినియోగించే అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు.faviparivar ను 18 చోట్ల క్లినికల్ ట్రయల్స్ లో వాడగా రెండింటి నుంచి మంచి వార్తలే అందాయని అంటున్నారు.ఇక tocilizumab ను 24 చోట్ల ప్రయత్నించగా అన్ని చోట్ల అనుకూల సమాచారమే ఉన్నట్టు చెబుతున్నారు. కాగా covid కు చికిత్సగా ప్రపంచవ్యాప్తంగా 60 డ్రగ్స్ వేర్వేరు క్లినికల్ ట్రయల్స్ లో ఉండగా,వాటిలో చాలా వరకు భారత్ లో తయారు చేయగలిగేవే కావడం విశేషం.ఇదిలా ఉండగా hydroxychloroquin ని కూడా నాలుగు కేసులలో ప్రయోగించి చూడగా మూడు ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నాయి.