ఏపీలో కొత్తగా 5,120 కరోనా కేసులు
posted on Oct 7, 2020 @ 6:19PM
ఏపీలో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతోంది. గతంలో రోజుకి పది వేల కేసులు నమోదు కాగా, గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఐదు వేల కేసులు నమోదవుతున్నాయి. అలాగే, కరోనా మరణాలు కూడా తగ్గుతున్నాయి.
ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,120 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,34,427కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 34 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 6,086 కి చేరింది. ఇప్పటివరకు కరోనా నుంచి 6,78,826 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 49,513 యాక్టివ్ కేసులున్నాయి.