'ఫిబ్రవరి 21' కాంగ్రెస్ ఖతం: లగడపాటి
posted on Jan 28, 2014 @ 11:45AM
పార్లమెంట్ సమావేశాలకు చివరి రోజైన ఫిబ్రవరి 21తో కాంగ్రెస్ పార్టీ పని ఖతమైపోతుందని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. తన నిర్ణయాన్ని మార్చుకోకుంటే కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్రలోని 25 లోక్‌సభ స్థానాల్లో డిపాజిట్లు దక్కవని గుంటూరులో హెచ్చరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే సీమాంధ్ర, తెలంగాణ రెండూ నష్టపోతాయి. సీమాంధ్రకు చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. మాకు రాజకీయ భవిష్యత్ లేకున్నా ఎలాంటి నష్టం లేదు. మా భవిష్యత్ కన్నా రాష్ట్ర భవిష్యత్ ముఖ్యం అని లగడపాటి అన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని ఆయన అన్నారు.