విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేలకు నోటిసులు
posted on Mar 30, 2013 @ 6:20PM
అవిశ్వాసం తీర్మానం సందర్భంగా విప్ ధిక్కరించిన 9 మంది కాంగ్రెస్, 9 మంది టిడిపి ఎమ్మెల్యేలకు స్పీకర్ నాదెండ్ల మనోహర్ శనివారం మధ్యాహ్నం నోటీసులు జారీ చేశారు. రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు ఆళ్లనాని, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, సుజయకృష ్ణరంగారావు, పేర్నినాని, ద్వారంపూడి, జోగి రమేష్, ముద్దాల రాజేష్, శివప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, వేణు గోపాలాచారి నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు.
టిడిపి నుంచి నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలలు బాలనాగిరెడ్డి, సాయిరాజ్, ప్రవీణ్ కుమార్ రెడ్డి, వనిత, కొడాలి నాని, అమర్ నాథ్ రెడ్డి, ఇతరులు ఉన్నారు