సత్తిబాబుకు డియస్ ఎర్త్
posted on Jun 25, 2013 @ 11:13AM
2014 ఎలక్షన్‌ల టార్గెట్‌గా అధిష్టానంలో రాష్ట్రకాంగ్రెస్‌లో భారీ మార్పులు చేయనుందన్న టాక్ వినిపిస్తుంది.. అయితే ఇందులో భాగంగా ముందు పిసిసి చీఫ్ బోత్సా సత్యనారాయణపై వేటు వేయడానికి రెడీ అవుతున్నారట కాంగ్రెస్ పెద్దలు.
ఇప్పటికే ఇందుకు సంబందించిన సంకేతాలు కూడా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు అందాయన్న టాక్ వినిపిస్తుంది.. ఈ ఎన్నికల్లో తెలంగాణా అంశమే ప్రదాన అంశం అవ్వనుంది కాబట్టి తెలంగాణ ప్రాంత వ్యక్తికి ఆ పదవిని కట్టబెట్టాలని చూస్తున్నారు.. అందుకు తగ్గట్టుగానే గత కొద్ది రోజులుగా మాజీ పిసిసి డియస్ ఢిల్లీలో మకాం వేసి అధిష్టానం పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నారు.
అధిష్టానం కూడా తెలంగాణ ప్రాంతంలో పార్టీకి జరుగుతున్న నష్టాన్ని భర్తి చేయడానికి తెలంగాణ ప్రాంత వ్యక్తి ఉన్నత పదవులు కట్టాబెట్టాలని చూస్తుంది.
గత కొద్ది రోజులుగా సియం మార్పు పై కూడా ప్రచారం జరుగుతున్న , అధిష్టానం అందుకు సుముఖంగా లేదని వాదన వినిపిస్తుంది. ప్రస్థుతం పిసిసితో పాటు మంత్రి పదవిలో కొనసాగుతున్న బోత్సాపైనే వేటుపడే అవకాశం కనిపిస్తుంది.. దీనికి తోడు ఇటీవల పలు వివాదాస్పద వ్యాక్యలతో పార్టీని ఇబ్బందుల్లో పడేసిన బోత్సా పై వేటు వేయడమే సరైన నిర్ణయంగా భావిస్తుందట అధిష్టానం..