రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేసేందుకు నగ్మా ప్రయత్నాలు..
posted on Jan 15, 2016 @ 10:52AM
కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నగ్మా రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయడానికి బానే కష్టపడుతున్నట్టు ఉంది. తమిళనాడులో పార్టీ వ్యవహారాలు చూస్తున్న నగ్మా తాజాగా తీసుకున్న నిర్ణయాలు చూస్తుంటే అలానే ఉన్నాయని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి. ఇంతకీ నగ్మా తీసుకుంటున్న నిర్ణయం ఏంటంటే.. కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల సంస్కృతికి కళ్లెం వేయాలని. మహిళా కాంగ్రెస్ లో గ్రూపులకు ఆస్కారం లేకుండా పనిచేయాలని ఈనేపథ్యంలోనే మహిళా నేతలకు ఆదేశాలు జారీ చేశారంట. ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించినా మహిళా విభాగంలో గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేసినా రాహుల్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరిస్తున్నారు.
కాగా తమిళనాడులో కాంగ్రెస్ పార్టీలో విజయధరణి అధ్యక్ష పగ్గాలు చేపట్టినానంతరం మహిళా రాజకీయాల్లో మరింత వేడెక్కింది. విజయధరణి ఏకంగా టీఎన్సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ను ఢీకొట్టడంతో వివాదం ముదిరింది. ఈ వివాదం కాస్త అధిష్టానంకి చేరడంతో ఇక మహిళా విభాగం రాష్ర్ట ఇన్చార్జ్ జాతీయ ప్రధాన కార్యదర్శి నగ్మా రంగంలోకి దిగారు. మహిళా నాయకుల్ని ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి తామంతా ఒక్కటే అని చాటేందుకు తీవ్ర కుస్తీల్లో పడ్డారు.