కాంగ్రెస్‌కు గడ్డు కాలమే
posted on Jul 25, 2013 @ 11:14AM
దేశవ్యాప్తంగా ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సర్వేల హడావిడి మొదలైంది.. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రల్లో ప్రస్థుత రాజకీయ పరిస్థితిపై సీఎన్‌ఎన్ ఐబీఎన్ సర్వే నిర్వహించింది. వచ్చే సాధారణ ఎన్నికల్లో తమిళనాడు మినహా దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో కాంగ్రెస్ పార్టీ, ప్రాంతీయ పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని ఈ సర్వే తేల్చింది. గతంలో జరిగిన ఎలక్షన్స్‌లో వచ్చిన రిజల్ట్స్ ఈ సారి రాబోయే రిజల్ట్స్ పూర్తీ భిన్నంగా ఉండబోతున్నాయని తేల్చింది సర్వే..
ఆంద్రప్రదేశ్‌లో కూడా అధికార కాంగ్రెస్‌కు ఎదురు గాలి వీస్తుందని ఈ సారి ఎలక్షన్స్‌లో కాంగ్రెస్ గెలువటం చాలా కష్టమని తేల్చింది.. తెలంగాణ ఏర్పాటు తో పాటు జగన్ అంశం స్కాం లు ఇలా పీకల్లోతు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్‌కు ఎన్నికలు సవాల్ గా మారనున్నాయి. రాష్ట్రంలోని 55 శాతం మంది ప్రజలు... కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై తీసుకోబోయే నిర్ణయం ఆధారంగానే తమ నిర్ణయం ఉంటుందని చెప్పినట్లు సర్వేలో వెల్లడైంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ సీట్ల సంఖ్య భారీగా పడిపోతుందని సీఎన్‌ఎన్ ఐబీఎన్ సర్వే స్పష్టంచేసింది. ప్రస్తుతం 33 సీట్లున్న అధికార కాంగ్రెస్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 11 నుంచి 15 సీట్లకే పరిమితం కానుందని సర్వే తేల్చేసింది. అదే సమయంలో 2009లో పోటీలో లేని వైఎస్సార్ కాంగ్రెస్ 11 నుంచి 15 స్థానాలు, ప్రస్తుతం 6 స్థానాలున్న ప్రతిపక్ష టీడీపీ 6 నుంచి 10 స్థానాలు గెలుస్తాయని సర్వే వెల్లడించింది.