నాలుగు చాల్లే అంటున్న కాంగ్రెస్ నేతలు
posted on Jun 13, 2012 @ 10:31AM
రాష్ట్రంలో 18అసెంబ్లీ స్థానాల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి 14స్థానాలు వస్తాయని పలు సర్వేల్లోనూ, మీడియా విశ్లేషణల్లోనూ అంటున్నారు. మాకు నాలుగంటే నాలుగుస్థానాలు వస్తే చాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మా పార్టీ తరుపున సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్సా సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కలిసి చేసిన ప్రచారం వల్ల ఆల్లగాడ్డం రామచంద్రాపురం, నర్సాపురం, తిరుపతి స్థానాల్లో తమ పార్టీ విజయం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశంపార్టీ 2 నుంచి 4స్థానాలకు ఎగపాకిందనీ మీడియా చెప్పే వార్తలను బట్టి చూసినా తమకు ఆ నాలుగుస్థానాలూ ఖాయమని వారు అభిప్రాయపడుతున్నారు. తమకు అందిన నివేదికల ప్రకారం ఈ నాలుగుస్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు కూడా బలమైన వారిగా గుర్తింపుకూడా ఉందని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. ఏమైనా సరే మాకు ఆ నాలుగుస్థానాలు దక్కితే చాలని వారు భావిస్తున్నారు. వీరిలా సర్ధుకుపోవటానికి సిద్ధమైనా ఫలితాలు వెలువడితే కదా కాంగ్రెస్ కల నెరవేరిందా? లేదా? అన్నది తేల్చటానికి సిఎం మాత్రం మాకు అత్యధికస్థానాలు వస్తాయని ఎన్నికల తరువాత ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయన ధీమా, ఈ సర్థుబాటు సంతృప్తి విషయం తేలాలంటే ఈ నెల 15వ తేదీన ఫలితాలు వెలువడేంత వరకూ వేచిచూడాల్సిందే!