పోరాడి ఓడిపోతున్న తెలుగుదేశం అభ్యర్థులు?
posted on Jun 13, 2012 @ 10:50AM
పరకాల అసెంబ్లీ నియోజకవర్గంలో తెలంగాణా సెంటిమెంటు పాళ్ళు ఎక్కువయ్యాయి. మిగిలిన 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జగన్ అరెస్టు సెంటిమెంటు ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ దశలో సెంటిమెంట్లపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మొదటి నుంచి చివరిదాకా పోరాడారు. ఆయన ఎంతలా పోరాడినా బలమైన సెంటిమెంట్లు వర్కవుట్ అయితేనో? అయినా ఫర్వాలేదు తెలుగుదేశం పార్టీకి రెండు స్థానాలు ఖాయమని మాజీ మంత్రి శంకరరావు తేల్చేశారు. ఈయన అలా అంటే విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ కూడా గుంటూరు జిల్లాలో తెలుగుదేశానికి కలిసొస్తుందని అంచానా వేశారు. ఆయన అంచనా ప్రకారం కూడా రెండు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందుతుంది. దీనికి పెద్దగా కష్టపదక్కర్లేదు. వీరిద్దరి మాటలు బాబు చెవిన పడ్డట్టున్నాయి. అందుకే కొంచెం శ్రద్ధగా గుంటూరు జిల్లాపై దృష్టి సారించారు. నిజంగా సెంటిమెంట్లు వేడి ముందు తాను ప్రచారం ఎంత చేసినా నిలువదని బాబూకూ తెలిసిందే. అందుకే తమకు రెండు సీట్లు వచ్చినా బోనస్ గానే భావిస్తామని ఆ పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. అసలు ఎన్నికల్లో విజయం కావాలి కానీ, ఉప ఎన్నికల్లో పెరిగే సీట్లన్నీ తమకు బోనస్ అని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ బోనస్ లెక్కలు ఎలా ఉన్నా అసలు సెంటిమెంట్లు ఎంత వరకూ వర్కవుట్ అయిందో ఈ నెల 15వ తేదీన ఫలితాలు వెలువడేంత వరకూ ఆగకతప్పదు.