వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ పదవుల కోసం వైసీపీలో పోటీ
posted on Dec 19, 2022 @ 11:17AM
వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీ.. ఔను ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నుంచి ఇటీవలే వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీగా పేరు మార్చుకున్న వర్సిటీయే.. ఆ వర్సిటీలో పదవుల కోసం వైసీపీలోని కీలక వ్యక్తుల మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొంది. వర్సిటీలో కీలక పదవులైన వీసీ, రిజిస్ట్రార్ పదవుల కోసం వైసీపీ నేతల సమీప బంధువుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
అలా పోటీ పడుతున్న వారు సీఎంకు అత్యంత సన్నిహితంగా ఉండే వైసీపీ నేతల బంధువులే కావడంతో ఈ వర్సిటీ పదవులు దక్కించుకునే వారెవర్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. హెల్త్ వర్సిటీ ప్రస్తుత చాన్సలర్ శ్యాంప్రసాద్ పదవీ కాలం జనవరి 13తో ముగియనుంది. ఈ పదవి కోసం మంత్రి సురేష్ సమీప బంధువు బాబ్జి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.
అయితే ప్రస్తుత వీసీ కూడామరో సారి వీసీగా కొనసాగేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇక వీసీ తరువాత అంత కీలకమైన వర్సిటీ రిజిస్ట్రార్ పోస్టు కోసం వైసీపీ ఎంపి వేంరెడ్డి ప్రభాకరరెడ్డి సమీప బంధువు, డాక్టర్ రాధికారెడ్డి ప్రయత్రాలు సాగిస్తున్నట్లు సమాచారం. అయితే ఆ పోస్టులలో జగన్ ఎవరిని నియమిస్తారన్నవిషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది.