దా..తిను..అమ్మరాదులే..!
posted on Sep 12, 2022 @ 12:39PM
పక్షులు,జంతువులకు మనిషితో చిత్రమైన సంబంధం ఉందన్నది పురాణకాలం నుంచి వింటున్నాం. మచ్చిక చేసుకోవాలేగాని జింకపిల్ల, కుక్కపిల్ల మాత్రమే కాదు పులి పిల్లనీ పెంచుకోవచ్చని జంతు ప్రేమికుల మాట. ఈ పాప ఎవరోగాని జింకపిల్లకు ఏదో తినిపిస్తోంది. చూస్తే అచ్చం డిస్నీ సీరియల్‌లో సీన్ గుర్తు చేస్తోందికదా!
ఆమధ్యనే ఓ రోజు మధ్యాన్నం ఆ పాప ఆరుబయట ఆడుకుంటూంటే, ఈ బుజ్జి జింక పిల్ల చెంగు చెంగు నా ఎగురుకుంటూ వచ్చింది. ముందు భయం భయంగా చుట్టూ చూసింది. ఈ చిన్నారి ఆడటం చూసి ఏమను కుందో తెలీదు కదలకుండా అలానే చూస్తుండిపోయింది. క్షణం తర్వాత పాప దాన్ని దగ్గరకు పిలిచింది. గతంలో మంచి స్నేహితురాలు పిలిచినట్టు మెల్లగా దగ్గరికి వెళ్లింది జింక పిల్ల. మామూలుగా దాని ఫ్రెండ్ పింకీ అయితే .. ఇవాళ స్కూలుకి వెళ్లావా, హోంవర్క్ ఏమిచ్చారనే అడిగేదేమో!
కానీ, జింక పిల్ల పెద్ద కళ్లతో చూసినపుడు దగ్గరగా వచ్చినపుడు దాని తలమీద నిమిరి అవేమీ అడగలేదు. రెండు ఆకులు తెంపి పెట్టింది. అది భయం భయంగా అటూ ఇటూ చూసి పాప వెళ్లని ముద్దాడి ఆకులు తీసుకుంది. ఫరవాలేదులే.. అమ్మ ఇంట్లో లేదు.. ధైర్యంగా తిను అన్నట్టు పాప జింక పిల్లను ప్రేమతో ముద్దాడి పంపింది. ఇది గదా మానవత్వం అంటే అన్నారు నెటిజన్లు. వీళ్ల స్నేహం కొనసాగాలని ఆశిద్దాం!