అదిగో కుంభకోణం, చేయండి రాజీనామా!
posted on Aug 19, 2012 @ 12:16PM
బొగ్గు కుంభకోణంలో దేశ ఖజానాకు రూ.1.86 కోట్ల నష్టానికి బాధ్యత వహించి ప్రధాని రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్‌చేస్తున్నాయి. ప్రధాని సీరియస్‌గా ఆత్మావలోకనం చేసుకోవాలి. పోటీ బిడ్డింగ్‌పై విధాన నిర్ణయం తీసుకోవడానికి ఉద్దేశపూర్వకంగా ఎనిమిదేళ్లు జాప్యం చేశారని, ఆ ఎనిమిదేళ్ళలో ఐదేళ్ళు బొగ్గు శాఖ ప్రధాని వద్దే ఉందని అందుచేత నైతిక బాధ్యత వహించి ప్రధాని రాజీనామాచేయాలని ప్రతిపక్షం ఆరోపించింది. అంతేకాక ఎనిమిదేళ్ళ జాప్యానికి ప్రధానమంత్రి కార్యాలయమే కారణమని అన్నాయి
అంతేకాక దీనిపై ఉభయసభల్లోను ప్రభుత్వాన్ని నిలదీస్తామని కూడా అన్నాయి. ప్రభుత్వపరంగా అవినీతో, కుంభకోణమో బయటపడటం ఆలస్యం ‘అదిగో అదిగో అవినీతి..కుంభకోణం... నైతిక బాధ్యత ఏది?.. చేయండి రాజీనామా..!’ ప్రతి ప్రతిపక్షం నుండి కొంచెం అటుఇటుగా అవేమాటలు...! అధికారంలోనివారికి ఈ ఛీత్కార సత్కారాలు వినీవినీ అలవాటైపోయిందేమో...‘మేం తామరాకుపై నీటిబొట్టు లాంటివాళ్ళం’ అంటూ కప్పదాటు వ్యవహారాలతో కాలం గడిపేస్తున్నారు. ఏదిఏమైనా ప్రభుత్వంలో బయటపడ్డ ప్రతి కుంభకోణానికి ప్రధాని రాజీనామా చేస్తుంటే ఏడాదికో ప్రధాని మారుండేవారంటూ విశ్లేషకులు సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. అయినా అసలు అధికారమంతా అమ్మ చేతిలో ఉంటే పాపం ప్రధాని ఏం చేస్తారు అన్నది ప్రజల సానుభూతి. అయితే ` జరుగుతున్న తంతుకు బాధ్యత ఎవరు వహించాలన్నది పెద్ద భేతాళప్రశ్నే!