కేజ్రీవాల్ పై నెటిజన్ల సెటైర్లు.. అసలు బుర్ర ఉందా..?
posted on Sep 29, 2016 @ 11:51AM
సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఉండే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై ఇప్పుడు నెటిజన్లు మండిపడుతున్నారు. ఇప్పటికే ఉరీ దాడిపై ఒకపక్క భారత్-పాక్ మధ్య యుద్ద వాతావరణం నెలకొంది. ఇక పాక్ చేసిన పనికి భారత్ ఆగ్రహంతో ఊగిపోతుంది. ఇక పాక్ పై అగ్రదేశాలు సైతం మండిపడుతుండటంతో ఏకాకి అయిపోయింది. అయితే దీనిపై స్పందించిన కేజ్రీవాల్.. యూరీ దాడి విషయంలో అంతర్జాతీయంగా పాకిస్థాన్ కాకుండా ఇండియానే ఒంటరి అయిపోతున్నట్లు కనిపిస్తోందంటూ ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతే కేజ్రీవాల్ చేసిన ట్వీట్లపై స్పందించిన నెజిజన్లు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై కామెంట్లు విసురుతున్నారు. సార్క్ సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకాకపోతే.. ఆయనకు బదులుగా కేజ్రీవాల్‌ని పాకిస్థాన్ ఆహ్వానించవచ్చు అని ఒకరు అంటే.. కేజ్రీవాల్‌కు అసలు బుర్ర ఉందా? అని ఒకరు..ఢిల్లీ అసలు సీఎంకి సలహాలు ఇచ్చేవాళ్లు ఎవరు? అని ఇంకొకరు ఎవరికి తోచిన విధంగా వారు సెటైర్లు విసురుతున్నారు. మరి ఈ సెటైర్లకు కేజ్రీవాల్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.