మే 7 వరకు స్విగ్గీ, జొమాటోలపై బ్యాన్! విమాన ప్రయాణీకులెవరూ రావద్దు!
posted on Apr 19, 2020 @ 9:07PM
కంటైన్‌మెంట్‌లో వున్న ప్రజలు నిబంధనలు పాటించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విమాన సర్వీసులు వున్న 7వ తేదీ వరకు ఎవరూ తెలంగాణాకు రాకండి. ఎందుకంటే ట్యాక్సీ వుండదు. హోటల్స్ కూడా వుండవు. కనుక ఎవరూ కూడా విమాన ప్రయాణీకులు మే 7వ తేదీ వరకు తెలంగాణాకు రావద్దని సి.ఎం. విజ్ఞప్తి ఇచ్చారు. ఈ లాక్‌డౌన్‌లో ఎవరూ ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోకుండా స్విగ్గీ, జొమాటోలను తెలంగాణాలో బ్యాన్ చేస్తున్నట్లు సి.ఎం. ప్రకటించారు. పది పదిహేను రోజులు పిజ్జా తినకపోతే ప్రాణం పోదు. బయటి నుంచి తినుబండారాలు తెప్పించుకోవద్దని సి.ఎం. విజ్ఞప్తి చేశారు. పండుగలు, ప్రార్థనలు ఇళ్లకే పరిమితం కావాలి. సామూహిక ప్రార్థనలను అనుమతించమని ముఖ్యమంత్రి హెచ్చరించారు. అన్నీ ఆలయాలను మూసివేశాం. ఎవరికీ మినహాయింపులు లేవు. ఏ మతంలోనూ సామూహిక కార్యక్రమాలను అనుమతించమని సి.ఎం. స్పష్టం చేశారు.