మహారాష్ట్రతో తెలంగాణ చారిత్రక ఒప్పందాలు..
posted on Aug 23, 2016 @ 3:20PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తో భేటీ అయ్యారు. ఈసందర్భంగా తుమ్మిడిహట్టి, మేడిగడ్డ, చనాకా-కొరాటా ఆనకట్టలపై ఇరు రాష్టాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. ఒప్పందాలపై ఇరు రాష్ట్ర సీఎంలు సంతకాలు చేశారు.
* ప్రాణహితపై తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణం.. తుమ్మిడిహట్టి పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లు. తుమ్మిడిహట్టి ద్వారా ఆదిలాబాద్లో 2 లక్షల ఎకరాలకు నీరు అందుతుంది.
* కాళేశ్వరం దిగువన మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం.. మేడిగడ్డ ఐదు పూర్తిస్థాయి నీటిమట్టం 100 మీటర్లు. కాగా ఐదు జిల్లాలకు మేడిగడ్డ బ్యారేజీ ద్వారా నీరు అందుతుంది.
* లోయర్ పెను గంగపై చనాకా-కొరాటా బ్యారేజీ నిర్మాణం. చనాకా-కొరాటా నీటి సామర్థ్యం 0.85
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మహారాష్ట్ర సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ చరిత్రలో ఇదొక అపూర్వ ఘట్టం.. మహారాష్ట్రతో ఎలాంటి విభేదాలు లేవు.. ఇలాగే సత్సంబంధాలు కొనసాగిస్తామని అన్నారు.
ఫడ్నవీస్ మాట్లాడుతూ.. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించాం.. రెండు రాష్టాలకు నీళ్లు చాలా అవసరం.. రెండు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేలా ఒప్పందాలు జరిగాయి.. నీటి వాటా విషయంలో తెలంగాణకు సహకరిస్తామని తెలిపారు.