మెరుగైన చికిత్స కోసం సింగపూర్ కు జయలలిత..
posted on Sep 24, 2016 @ 12:36PM
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అస్వస్థకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. అయితే ఆమెను మెరుగైన చికిత్స కోసం సింగపూర్ తరలించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. జయలలితకు మధుమేహం, కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా ఉండటంతో మరింత మెరుగైన చికిత్స అందించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు జయలలిత అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలు ఆమె తొందరగా కోలుకోవాలని కోరుతూ తమిళనాడులోని పలు దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. ప్రధాని మోడీ కూడా జయలలిత త్వరగా కోలుకోవాలని ఆమెకు బొకే పంపించారు.
అయితే ఈ వార్తలను ఆమె పార్టీ ఏఐఏడీఎంకే నేతలు తీవ్రంగా ఖండించారు. ఏఐఏడీఎంకే నేత సీఆర్ సరస్వతి మాట్లాడుతూ.. ప్రస్తుతం జయలలిత సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని.. ఆమె మెరుగైన చికిత్స కోసం సింగపూర్ వెళ్తోన్నారని వస్తోన్న వార్తలన్ని రూమర్లని కొట్టిపడేశారు.