సీనియర్ నేతను పదవి నుండి తొలగించిన జయలలిత..
posted on Sep 12, 2016 @ 6:26PM
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తమ పార్టీ సీనియర్ నేత అయిన నాథమ్ విశ్వనాథన్‌ను పార్టీ నుండి తొలగించినట్టు ప్రకటన చేశారు. నాథమ్ విశ్వనాథన్ అన్నాడీఎంకే పార్టీలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన అన్నాడీఎంకే పార్టీ ఆర్గనైజేషన్ సెక్రటరీగా బాధ్యతలు చేపడుతున్నారు. ఈనేపథ్యంలో జయలలిత ఆయనను.. పార్టీ ఆర్గనైజేషన్ సెక్రటరీ పదవి నుంచి అలాగే.. పార్టీ కమ్యూనికేషన్ గ్రూప్ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకొని.. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే విశ్వనాథన్ ను పదవి నుండి తొలగించడానికి గల కారణాలు తెలియకపోయినా.. ఓ వార్త మాత్రం చక్కర్లు కొడుతుంది. ఇటీవల ఆదాయపన్ను శాఖ అధికారులు దిండిగల్‌లోని విశ్వనాథన్ ఆస్తులపై సహా ఆయనకు సంబంధం ఉన్న నలభై ప్రాంతాల్లో దాడులు చేసినట్లు ఈ నేపథ్యంలోనే ఆయనను పార్టీకి దూరం చేసినట్లు తెలుస్తోంది. మరి జయలలిత ఆంతర్యం ఏంటో...