13 న డిల్లీకి సియం
posted on Aug 11, 2013 @ 11:06AM
సీమాంద్ర నిరసన జ్వాలల నేపధ్యంలో సియం కిరణ్‌కుమార్ రెడ్డి మరోసారి డిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 13 న డిల్లీ వెళ్లనున్నా ఆయనరాష్ట్ర విభజన నిర్ణయం అనంతరం ఏర్పడిన పరిస్థితులు, ప్రజలు లేవనెత్తుతున్న అభ్యంతరాలను అధ్యయనం చేసేందుకు కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఏకే ఆంటోని కమిటీతో ఆయన భేటీ కానున్నారు. ఇప్పటికే డిల్లీలో ఉన్న పిసిసి చీఫ్ బోత్స సత్యనారాయణ కూడా అదే రోజు ఆంటోని కమిటీతో టేటి కానున్నారు.
13న డిల్లీ అందుబాటులో ఉండాలన్న హైకమాండ్ ఆదేశంతో ఇద్దరు నేతలు ఆ రోజు డిల్ల ఈ వెళ్లనున్నారు. సియం, పిసిసి చీఫ్‌లతో సమావేశాల తరువాత ఆంటోని కమిటీ రాష్ట్ర పర్యటనకు సంభందించి ఓ ప్రకటన విలువడనుంది. ఆంటోని కమిటీతో భేటీ అనంతరం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్, సోనియాగాంధీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్‌పటేల్, ఇతర పెద్దలను కూడా సీఎం కలవనున్నారు. సోనియాగాంది అపాయింట్‌మెంట్ కోసం కూడా సియం ప్రయత్నిస్తున్నారు.