శాసనమండలిలో చంద్రబాబు.. సమావేశాలు ఇవే చివరివి
posted on Sep 10, 2016 @ 4:31PM
ఏపీ శాసనసభలో ప్రతిపక్ష నేతుల ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనమండలిలో ఏపీ ప్రత్యేక హోదా ప్రకటించారు. ఏపీ శాసన మండలి సమావేశాలకు హాజరైన ముఖ్యమంత్రి కాస్త భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గత స్మృతులను గుర్తుచేసుకున్నారు. 1980లో తొలిసారి మండలి సమావేశాలకు హాజరైనట్టు తెలిపారు. అంతేకాదు ఏపీ అసెంబ్లీ సమావేశాలు హైదరాబాద్లో ఇవే చివరివై ఉండవచ్చని పేర్కొన్నారు. ఇంకా హోదా గురించి మాట్లాడుతూ.. ఏపీ ప్రత్యేకహోదాపై కేంద్రం నుండి ప్రకటన రావడంతో బీజేపీ బీజేపీ, తెలుగుదేశం నేతల తీరుపై పలువురు చేసిన విమర్శల చేస్తున్నారని.. మంచి పనులు చేస్తున్న తమపై ఎన్నో విమర్శలు గుప్పిస్తున్నారని, తనను చెప్పుతో కొడతానని కొందరు అన్నారని.. ఈ వ్యాఖ్యకు తాను ఎంతగానో బాధపడినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రానికీ హోదా ఇచ్చే పరిస్థితి లేదని కేంద్రం చెబుతోందని.. కేంద్రం పెద్దలు ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలన్నీ ఇస్తామంటున్నారని అన్నారు.