వారిని మోసం చేస్తే జైలుకే..
posted on Oct 28, 2016 @ 11:43AM
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన అధికారులకు కొన్ని హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రైతులకు అమ్మే విత్తనాలపై ఆయన స్పందిస్తూ.. నకిలీ విత్తనాలు అమ్మే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాదు రైతులను మోసం చేస్తే జైలుకు పంపుతామని హెచ్చరించారు. రాబోమే ఫిబ్రవరిలో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా రెయిన్ గన్స్ వినియోగించాలి, రక్షణతడులిచ్చి పంటలు కాపాడాలన్నారు. పశుగ్రాసం విత్తనాలు సరఫరా చేసి వేసవిలో కొరతలేకుండా చూడాలని, సబ్సిడీ ధరలకు పశుగ్రాసం సరఫరా చేసి పశుపోషకులకు అండగా ఉండాలని సూచించారు. వ్యవసాయం, అనుంబంధ రంగాల ప్రగతిపై జిల్లాలకు గ్రేడింగ్ ఇవ్వాలని, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పరిష్కరించాలని అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.