లోకేశ్ కు చంద్రబాబు క్లాస్...
posted on Oct 21, 2016 @ 12:28PM
చంద్రబాబు నాయుడు అప్పుడప్పుడు ప్రభుత్వ అధికారులకు క్లాసులు పీకుతుంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు తన తనయుడు నారా లోకేశ్ కు కూడా క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. అది కూడా గుంటూరులోనే ఉండమనట. చంద్రబాబు ఇప్పటికే హైదరాబాద్ నుండి మకాం మార్చేశారు. ఆయనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇంకా ప్రభుత్వ అధికారులు సైతం ఇక్కడికే వచ్చి పాలన సాగిస్తున్నారు. అయితే లోకేశ్ మూడు రోజులు గుంటూరులో, నాలుగు రోజులు హైదరాబాద్ లో ఉంటున్నాడు. దీంతో ఇకపై గుంటూరులోనే ఉండాలని ఆయన ఆదేశించినట్టు తెలుస్తోంది. గుంటూరు కార్యాలయంలో ఎవరూ లేకుంటే, అక్కడికి వచ్చే వారంతా ఇబ్బంది పడతారని భావించి లోకేష్ ను, అన్ని రోజులూ గుంటూరులో ఉండాలని సూచించారట. ఈ విషయంపై ఇద్దరి మధ్య పెద్ద చర్చే జరిగిందట. గతంలో మాదిరిగా చేయవద్దని, ఇకపై పూర్తిస్థాయిలో కార్యకర్తలకు అందుబాటులో ఉండాలనీ, నాయకులు, ఎమ్మెల్యేలను తరచూ కలుసుకుంటూ ఉండాలని ఈ సందర్భంగా చంద్రబాబు క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. మరి తండ్రి మాటను కొడుకు ఎంతవరకూ పాటిస్తాడో చూద్దాం..