ఇకపై చంద్రబాబుకు ఓటు హక్కు ఉండదు..
posted on Jul 13, 2016 @ 11:36AM
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాదాపు హైదరాబాద్ ను వదిలేసినట్టు కనిపిస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్ నుండే పాలన సాగించిన చంద్రబాబు.. అలా అయితే వర్కవుట్ కాదని భావించి.. అక్కడి నుండి విజయవాడకు మకాం మార్చి.. ఇప్పుడు పూర్తిగా విజయవాడకే అంకితమైపోయి అక్కడి నుండే పాలన సాగిస్తున్నారు. ఇక ఇప్పుడు ఆయన చిరునామా కూడా పూర్తిగా మారిపోనుంది. ఆయన స్వయంగా తన చిరునామాను మార్చేయాలని అధికారులను కోరారు.
చంద్రబాబు విజయవాడ సమీపంలో గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి పరిధిలోని లింగమనేని హౌస్ ను నివాసంగా మార్చుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన తన అధార్ కార్డులోని హైదరాబాద్ చిరునామాకు బదులుగా.. ఇక్కడి చిరునామాను మార్చేయాలని ఉండవల్లి గ్రామ పంచాయితీ అధికారులను కోరడంతో.. అధికారులు ఆపనిలో పడ్డారట. అంతేకాదు పనిలో పనిగా ఓటరు కార్డులోని తన హైదరాబాద్ చిరునామాను కూడా మార్చేసి ఉండవల్లి అడ్రస్ నే చేర్చాలని కూడా చంద్రబాబు అదేశాలు జారీ చేసేశారట. ఇక చంద్రబాబు చెప్పినట్టు అధికారులు అడ్రస్ మార్చడం జరిగితే.. ఇకపై చంద్రబాబుకు హైదరాబాద్లో ఓటు హక్కు ఉండదు. ఉండవల్లి పంచాయితీలోనే ఆయనకు ఓటు హక్కు ఉంటుంది. మొత్తానికి చంద్రబాబు హైదరాబాద్ ను వదిలించుకోవాలనుకున్నట్టు ఉన్నారు. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు..