ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
posted on May 21, 2016 @ 11:53AM
ఏపీ ఎంసెట్ మెడికల్ ఫలతాలు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంసెట్ ఫలితాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మొదటి పది ర్యాంకులు సాధించిన వారి పేర్లను తెలిపారు. మెడిసిన్ లో ఫస్ట్ ర్యాంకు ఎం. హేమలత(156 మార్కులు), ఎర్ల స్వాతిక్ రెడ్డి (155 మార్కులు)మూడో ర్యాంకు యజ్ఞప్రియ (153మార్కులు), నాలుగో ర్యాంకు నేహా (152 మార్కులు), ఐదో ర్యాంకు విక్రమ్ ఖాన్ (152 మార్కులు), ఆరో ర్యాంకు సొంటి సాహితి (152 మార్కలు), ఏడో ర్యాంకు పెద్దిరెడ్ల శైలజ(150 మార్కులు), ఎనిమిదో ర్యాంకు గ్రీష్మభావన(150 మార్కులు), తొమ్మిదో ర్యాంకు దారం శివకుమార్(150 మార్కులు), పదో ర్యాంకు సాయి ప్రతాప్ రెడ్డి(150 మార్కులు) సాధించినట్టు తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఎడ్యుకేషన్ కే ఏపీ పెద్ద పీట వేస్తుందని.. ఏపీని నాలెడ్జ్ హబ్ గా మారుస్తామని..పదేళ్లలో అక్షరాస్యత మరింత పెరుగుతుంది వ్యాఖ్యానించారు. నీట్ పై కేంద్రం ఆర్డినెన్స్ అందాల్సి ఉందని.. వచ్చే ఏడాది నీట్ కు ప్రిపేర్ కావాలని.. నీట్ సిలబస్, అధ్యాపకుల ట్రైనింగ్ పై విద్యాశాఖ సమీక్ష నిర్వహిస్తుందని తెలిపారు. జూన్ 1 వ తేదీన డీఎస్సీ అభ్యర్ధులకు అపాయింట్ మెంట్ లెటర్స్ అందిస్తామని చెప్పారు. గత ప్రభుత్వాలు సకాలంలో పరీక్షలు నిర్వహించలేదని అన్నారు. కాగా రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్, ప్రత్తిపాటి పుల్లారావు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి తదితరులు ఫలితాల విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు.