గవర్నర్ నరసింహన్ కు అలానే బావుందంట
posted on Sep 18, 2015 @ 5:02PM
ప్రసుత్తం తెలుగు రాష్ట్రాల ఇద్దరు ముఖ్యంమంత్రులు వారి వారి పనులతో బిజీబిజీగా కాలం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఒక గవర్నర్ ఉన్నారనే సంగతి మర్చిపోయారని వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రం విడిపోకముందు ఏవో చిన్న చిన్న సమస్యలు ఉన్నా గవర్నర్ దగ్గరకు వచ్చి పరిష్కార మార్గం చూపమని కోరేవారు. అయితే రాష్ట్రం విడిపోయిన తరువాత రెండు రాష్ట్రాల మధ్య వాదాలు ఒక రేంజ్ లో ఉండేవి. అప్పుడు కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు అడపాదడపా గవర్నర్ దగ్గరకు రావడం వారి సమస్యలు వివరించడం జరిగేది. అయితే ఎప్పుడైతే ఓటుకు నోటు వ్యవహారం బయటపడిందో అప్పుటి నుండి గవర్నర్ కు అసలు చిక్కులు వచ్చిపడ్డాయి. ఈవిషయంపై ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఒకరి మీద ఒకరు పోటాపోటీగా గవర్నర్ కు ఫిర్యాదులు చేశారు. అయితే గవర్నర్ మాత్రం ఈ విషయంలో రెండు రాష్టాలకు సరైన పరిష్కార మార్గం చూపలేకపోయారు. ఎవరిని సపోర్టు చేస్తే ఏం సమస్య వచ్చిపడుతుందో అన్న భయంతో వ్యవహారాన్ని నాన్చుతూ వచ్చారే తప్ప సరైన చర్యలు తీసకోలేకపోయారు. ఇక అప్పటినుండి ఇద్దురు సీఎం లు కూడా గవర్నర్ తో అంటీ ముట్టనట్టే వ్యవహరిస్తున్నారు. ఏ సమస్య వచ్చిన కోర్టునో.. కేంద్రాన్నో ఆశ్రయిస్తున్నారే తప్ప గవర్నర్ వరకూ వెళ్లడం లేదు. దీంతో ఇద్దరు సీఎంలే కాదు.. మంత్రులు.. అధికారులు కూడా రాజభవన్ ఎక్కడుందో మరిచిపోయారంటూ.. అసలు గవర్నర్ అనే వ్యక్తి ఒకరు ఉన్నారంటూ మర్చిపోయారని కొంతమంది విమర్శకులు కూడా విమర్శిస్తున్నారు. అసలు సంగతేంటంటే గవర్నర్ కూడా ఎలాంటి తలనొప్పులు లేకుండా.. ఈజీవితమే హాయిగా ఉందని.. హాయిగా కాలం గడిపేస్తున్నారట.