మనకెందుకు రావడంలేదు.. చంద్రబాబు
posted on Aug 19, 2015 @ 12:00PM
సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనలో భాగంగా టీడీపీ నియోజక వర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతల పని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లూడుతూ అసలు ఇల్లు కూడా వదిలి బయటకు రాని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఎమ్మెల్యేగా పోటీచేస్తే ప్రత్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కకుండా గెలుస్తున్నారు.. ఓటర్లు ఆమెను గెలిపిస్తుంటే.. నిరంతరం కుప్పంలో అభివృద్ధి పనులు చేపడుతూ.. ప్రజల బాగోగులు తెలుసుకుంటూ.. తరుచూ నియోజక వర్గంలో పర్యటించే మనకు ఆశించిన మెజారిటీ ఎందుకు రావడంలేదని చంద్రబాబు పార్టీ శ్రేణులను ప్రశ్నించారు. అంతేకాదు కొంతమంది నేతలు అహంతో వ్యవహరిస్తున్నారుని.. దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వ చేపట్టే ఏ కార్యక్రమమైనా కాని కార్యకర్తల ప్రమేయంతోనే సాగాలన్నారు. కాగా పలు సమస్యలను కార్యకర్తలు ఆయన దృష్టికి తీసుకురాగా.. వాటితో తానూ ఏకీభవిస్తున్నానన్నారు.