కుప్పానికి కృష్ణమ్మ...అపరభగీరథుడు చంద్రబాబు
posted on Aug 30, 2025 @ 5:09PM
అసలేంటి హంద్రీనీవా ప్రాజెక్టు దీని పూర్వాపరాలు ఎలాంటివి అని చూస్తే.. రాయలసీమలోని నాలుగు కరువు ప్రభావిత మాజీ జిల్లాలకు సాగు, త్రాగునీటి సౌకర్యాలు అందించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.
హంద్రి–నీవా మెయిన్ కెనాల్, కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల గ్రామం సమీపంలోని శ్రీశైలం ఆనకట్ట జలాశయం నుంచి ప్రారంభమవుతుంది. 120 వరద రోజులలో 40 టీఎంసీల కృష్ణా వరదనీటిని వినియోగించుకునేలా ప్రతిపాదన. మెయిన్ కెనాల్ వెంట 12 చోట్ల లిఫ్టులు ఏర్పాటు చేశారు.
సుమారు 6,02,500 ఎకరాలకు అంటే 2.438 లక్షల హెక్టార్లు ఖరీఫ్ సాగునీరు, అలాగే 33 లక్షల మందికి 4 టీఎంసీలు త్రాగునీటి సదుపాయం కల్పన. ముచ్చుమర్రి లిఫ్ట్ వద్ద రిజర్వాయరు లెవెల్ +244.700 మీటర్లు అంటే 802.821 అడుగుల దగ్గర ఉన్నప్పుడు నీటిని తీసుకుంటారు.
మెయిన్ కెనాల్ మొత్తం పొడవు 554.175 కి.మీ. ఉంది. కర్నూలు జిల్లా మల్యాల నుంచి అన్నమయ్య జిల్లాలోని అదవిపల్లె రిజర్వాయరు వరకు సాగుతుంది. గరిష్ట డిమాండ్ తీర్చడానికి 9.05 టీఎంసీల సామర్థ్యం గల 8 రిజర్వాయర్లు ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టుకు కావలసిన విద్యుత్ సుమారు 672 మెగావాట్లుగా ఉంది.
ప్రాజెక్టు దశల విషయానికి వస్తే.. ఫేజ్–I: జీడిపల్లె రిజర్వాయరు వరకు వెళ్తుంది. ఇది 1,98,000 ఎకరాలకు సాగునీరు, 14 టీఎంసీల నీరందిస్తుంది. ఇక ఫేజ్–II: జీడిపల్లె నుంచి అదవిపల్లె రిజర్వాయరు వరకు సాగుతుండగా.. 4,04,500 ఎకరాలకు సాగునీరు, 26 టీఎంసీల మేర అందిస్తుంది. మెయిన్ కెనాల్‌పై రిజర్వాయర్ల విషయానికి వస్తే.. కృష్ణగిరి – 0.161 TMC కాగా, పాతికొండ – 1.126 TMC, జీడిపల్లె – 1.631 TMC, కాగా మరాల – 0.465 TMC, శ్రీ ఎం.ఆర్. శ్రీనివాసపురం – 1.020 TMCగా ఉంది. అదవిపల్లె – 1.814 TMCలుగా ఉంది.
బ్రాంచ్ కెనాల్‌పై రిజర్వాయర్ల విషయానికి వస్తే.. గోల్లపల్లె – 1.913 TMC మడకశిర బ్రాంచ్ కెనాల్‌పై, చెర్లపల్లె – 1.608 TMC పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌పై బ్రాంచ్ కెనాళ్లు, ఇక డిస్ట్రిబ్యూటరీలు, మడకశిర బ్రాంచ్ కెనాల్ 235.435 Km – 61,557 ఎకరాలు, పేరూరు బ్రాంచ్ కెనాల్: 6.07 Km – 80,600 ఎకరాలు, పుంగనూరు బ్రాంచ్ కెనాల్: 220 Km – 37,300 ఎకరాలు, తంబళ్లపల్లె బ్రాంచ్ కెనాల్: 29.43 Km – 15,000 ఎకరాలు, నీవా బ్రాంచ్ కెనాల్: 132.35 Km – 57,500 ఎకరాలు, వాయలపాడు బ్రాంచ్ కెనాల్: 23.5 Km – 17,200 ఎకరాలు, చింతపర్తి డిస్ట్రిబ్యూటరీ.. 42.30 Km – 22,400 ఎకరాలు, ఎల్లుట్ల డిస్ట్రిబ్యూటరీ: 25.17 Km – 15,400 ఎకరాలు, సదుము డిస్ట్రిబ్యూటరీ: 39.28 Km – 5,400 ఎకరాలు, పుంగనూరు బ్రాంచ్ కెనాల్, మెయిన్ కెనాల్ @ కిమీ 400.500, పట్టణం గ్రామం, కదిరి మండలం, శ్రీ సత్యసాయి జిల్లా నుండి ప్రారంభం కానుంది. దీని పొడవు: 220.350 Km. జ్యూరిస్డిక్షన్: గుద్దంపల్లె (అన్నమయ్య జిల్లా) నుండి కలగటూరు అంటూ చిత్తూరు జిల్లా వరకు ఉంటుంది.
ఇక కుప్పం బ్రాంచ్ కెనాల్ పుంగనూరు బ్రాంచ్ కెనాల్ @ Km 207.800, అప్పినపల్లె, పెద్దపంజాణి మండలం, చిత్తూరు జిల్లా వద్ద ప్రారంభం కానుంది. 110 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు నీరందించడం, 6,300 ఎకరాల సాగునీరు స్థిరీకరించడం, అలాగే పాలమనేరు & కుప్పం నియోజకవర్గాల 8 మండలాల్లో 4.02 లక్షల మందికి త్రాగునీరు అందించడం. పొడవు వివరాలు : 131.200/143.900 Km, 3 లిఫ్టులు ఏర్పాటు చేశారు. కుప్పం చివర్లోని కెనాల్ చివర పరమసముద్రం చెరువుకు ఈ నీరు చేరుతుంది.
దీన్నిబట్టీ చూస్తే.. చిత్తూరు జిల్లా చివరి ఆయకట్ట వరకూ కృష్ణాజలాలు ప్రవహించడం ఒక చరిత్ర, 2014 నుంచి 2019 మధ్య వరకూ నాలుగు వేల కోట్ల వరకూ వెచ్చించిన చంద్రబాబు 2024 లో తిరిగి పీఠమెక్కాక.. నెలలో మెయిన్ కెనాల్ పూర్తి చేసి.. కృష్ణా జలాలను ఎట్టకేలకు కుప్పం చేర్చారు. ఈ విషయంలో ఆయన్ను అపర భగీరథుడని అనడంలో ఎలాంటి సందేహం లేదంటారు ఈ ప్రాంత వాసులు.