తుపాకీ ఫైర్.. జవాన్ సూసైడ్..
posted on Mar 26, 2021 @ 2:18PM
పరీక్షా తప్పదని విద్యార్ధి సూసైడ్ చేసుకుంటారు. తల్లిదండ్రులు తమ ప్రేమను అంగీకరించలేదని ప్రేమ జంట ఆత్మహత్యలు చేసుకుంటారు. పెళ్ళాం పెట్టె బాధ భరించలేక భర్త , భర్త తిట్టాడని భార్య చనిపోవడం చూస్తుంటాం..లేదంటే కొందరు ఆర్థిక ఇబ్బందులతో చనిపోతారు. రైతు అప్పు తీరలేదని, గిట్టుబాటు రాలేదని ఆత్మ హత్యలు చేసుకుంటారు.
తను ఒక జవాను. దేశ సేవకుడు. త్యాగానికి దాహం లాంటివాడు. డ్యూటీకి వచ్చి. తన ప్రాణాలు తానే తీసుకున్నాడు. దేశానికి రక్షణ కల్పించే జవాన్ యుద్ధంలో వీరమరణం పొందుతారు.. లేదంటే అకాల మరణం చెందుతారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సీఐఎస్ఎఫ్ జవాన్ తన వద్ద ఉన్న ఏకే47తో గొంతులో కాల్చుకుని ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు.
తమిళ నాడు సేలం ఎన్నికల విధుల నిమిత్తం వంద మంది పారా మిలిటరీ, సీఐఎస్‌ఎఫ్ జవానులు అన్నదాన పట్టిలో బస చేస్తున్నారు. ఈ క్రమంలో సీఐఎస్‌ఎఫ్ జవాన్ ఆశిష్ కుమార్ (30) గది నుంచి తుపాకీ పేలిన శబ్దం రావడంతో.. వెంటనే అక్కడున్న జవాన్లు వెళ్లి చూడగా.. ఆశిష్ కుమార్ ఏకే47తో గొంతులో ఫైర్ చేసుకుని రక్తపు మడుగులో పడి ఉన్నాడు. జవాన్లు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆశిష్ కుమార్ పరిస్థితి విషమంగా ఉన్నది.
అయితే ఆశిష్ కుమార్ ఆత్మహత్యాయత్నానికి కారణాలు స్పష్టంగా తెలియరాలేదు. కుటుంబ సమస్యలా..? లేక పని భారంతో ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆశిష్ కుమార్ ఫ్లయింగ్ స్క్వాడ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు.