ఇండియా - బంగ్లాదేశ్ మధ్య దూరడానికి చైనా ప్లాన్
posted on Oct 14, 2016 @ 12:00PM
బంగ్లాదేశ్ కు తన ధన బలంతో చెక్ పెట్టాలని చైనా బాగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. బంగ్లాదేశ్ కు సహాయం చేసే నేపథ్యంలో రెండు దేశాల మధ్య రావడానికి చైనా ప్రయత్నిస్తుంది. ఇప్పటికే బంగ్లాదేశ్ తో ఉన్న స్నేహబంధాన్ని కొనసాగిస్తూ, పలు ప్రాజెక్టులకు 2 బిలియన్ డాలర్లను (సుమారు రూ. 13 వేల కోట్లు) భారత్ బంగ్లాదేశ్ కు ఇవ్వగా.. ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి చైనా కూడా ముందుకు వస్తుంది. దాదాపు 30 సంవత్సరాల తరువాత చైనా ప్రధాని క్సీ జిన్ పింగ్ బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలపై సంతకాలు జరగనున్నట్టు తెలుస్తోంది. మౌలిక వసతులు, పవర్ ప్లాంట్ల నిర్మాణం కోసం 24 బిలియన్ డాలర్లను (సుమారు రూ. 1.60 లక్షల కోట్లు) రుణంగా ఇవ్వనుంది. 1,320 మెగావాట్ పవర్ ప్లాంట్ సహా మొత్తం 25 ప్రాజెక్టులకు చైనా నిధులను అందిస్తోందని తెలుస్తోంది. దీంతో పాటు నౌకాశ్రయం నిర్మాణానికీ దీర్ఘకాల రుణమివ్వనుందని బంగ్లాదేశ్ ఆర్థికమంత్రి ఎంఏ మన్నామ్ తెలిపారు. అంతేకాదు జియాంగ్రూ ఎటెర్న్ కంపెనీ లిమిటెడ్ సంస్థ 1.1 బిలియన్ డాలర్ల వ్యయంతో బంగ్లాలో పవర్ గ్రిడ్ నెట్ వర్క్ ను విస్తరించేందుకు డీల్ కుదుర్చుకుందని.. ఇంకా ఎన్నో దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన సొనాడియా నౌకాశ్రయం నిర్మాణం నిమిత్తం త్వరలో కార్యరూపం దాల్చనుందని మన్నామ్ తెలిపారు. మొత్తానికి ఇండియా - బంగ్లాదేశ్ మధ్య దూరడానికి చైనా పెద్ద ప్లానే వేసింది.