సిద్దూ ఎం చేసినా వెరైటియే..కాకి వాలిందని..
posted on Jun 12, 2016 @ 10:34AM
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఏం చేసినా పబ్లిసిటీ అయిపోతోంది. అదేంటి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎం చేసినా అది సంచలనమే కదా. మొన్నామధ్య ఖరీదైన వాచీ పెట్టుకోని విమర్శలు మూటకట్టుకున్న సిద్ధూ..ఆ వెంటనే ఏసీబీ ఏర్పాటు, కుమారుడికి లబ్ధి చేకూర్చడం ఇలా ఒకటేంటి సీఎం సార్ ఫుల్లుగా వార్తల్లో వ్యక్తి అయ్యారు. మళ్లీ రీసెంట్‌గా ఆయన కొత్త కారు కొన్నారు. అదేంటి కారు కొంటే అందులో వింతేముంది అనేగా మీ సందేహం. అక్కడికే వస్తున్నాం..
సిద్ధరామయ్య కారుపై జూన్ 2న ఓ కాకి వాలింది. డ్రైవర్ తరిమికొట్టినా వెళ్లకుండా..దాదాపు 10 నిమిషాల పాటు కారుపై ఉండిపోయింది. ఈ విషయం మీడియా ద్వారా రాష్ట్రం మొత్తం వ్యాపించింది. సాధారణంగా కాకిని చెడు శకునంగా భావిస్తుంటారు. దీంతో సీఎం నిన్న రూ.35 లక్షలు ఖర్చు పెట్టి టొయోటా ఫార్చ్యూనర్ కారు కొనుగోలు చేశారు. అయితే కాకి వాలడం వల్లే ముఖ్యమంత్రి గారు కొత్త కారు కొనేశారంటూ వార్తలు వస్తుండటంతో ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది.