టాయిలెట్లు క్లీన్ చేసిన టీఆర్ఎస్ ఎంపీ
posted on Jul 16, 2016 @ 6:19PM
ప్రధాని నరేంద్రమోడీ స్వచ్ఛభారత్ పిలుపునందుకుని దేశంలోని రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు రంగంలోకి దూకారు. ప్రతి ఒక్కరు చేతికి గ్లోవ్స్ తొడుక్కుని..ఫోటోలకు ఫోజులిస్తూ చెత్తను ఏరి పారేశారు. అయితే స్వచ్ఛబారత్ అంటే రోడ్డుపై చీపురు పట్టుకుని ఊడవటం కాదని చాటిచెప్పారు చేవెళ్ల టీఆర్ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ధర్మసాగర్, గొల్లపల్లి ప్రభుత్వా పాఠశాలల్లో టాయిలెట్లను ఆయన శుభ్రం చేశారు. చేవెళ్ల మండలంలో 11 టాయిలెట్ క్లీనర్‌లను ఏర్పాటు చేశారు ఎంపీ. అలా ఏర్పాటు చేసిన వాహనాన్ని తనే స్వయంగా నడుపుకుంటూ వెళ్లి..స్కూల్లో టాయిలెట్స్ శుభ్రం చేశారు. ఆ తర్వాత విద్యార్థులతో మాట్లాడి..స్వచ్ఛభారత్‌కు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. బిల్‌గేట్స్, ప్రధాని మోడీలు స్వయంగా టాయిలెట్స్ క్లీన్ చేసుకుంటుంటారని..మన టాయిలెట్స్ మనం శుభ్రం చేసుకోవడంలో తప్పులేదన్నారు విశ్వేశ్వర్ రెడ్డి.