చెన్నై ఐపీఎస్ అధికారి ఆత్మహత్య.. కారణం అదేనా..?
posted on Feb 18, 2016 @ 5:26PM
చెన్నై లో యువ ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగుచూసింది. తమిళనాడు రాజధాని చెన్నై శివారు ప్రాంతం ఎగ్మోర్‌లో ఎన్ హరీశ్ ఐపీఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈయన చెన్నైలోని ఎగ్మోర్ ప్రాంతంలో ఐపీఎస్ అధికారుల క్వార్టర్స్‌లో ఉంటున్నాడు. అయితే ఈరోజు ఈయన కోసం కార్యలయ సిబ్బంది రాగా ఆయన మాత్రం ఎంతసేపటికీ తలుపులు తెరవక పోవడంతో అనుమానం వచ్చి వారు తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే హరీశ్ చనిపోయి ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు.
అయితే అధికారుల సమాచారం ప్రకారం కాస్త కొద్ది రోజుల నుండి హరీశ్ ప్రమోషన్ పై విచారణ జరుగుతోందని.. అతని బ్యాచ్ వాళ్లకి రెండేళ్ల కిందటే ప్రమోషన్స్ వచ్చాయి దీంతో హరీశ్ మనస్తాపం చెందినట్టు తెలిపారు. అయితే ఇప్పుడు హరీశ్ ఆత్మహత్యకు పదోన్నతి అంశమే కారణమా? లేక వేరే ఏదైనా ఉందా? అని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు