కేసీఆర్ యాగానికి చంద్రబాబు..! ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?
posted on Dec 22, 2015 @ 4:23PM
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయుత చండీయాగానికి అంకురార్పణం చేసిన సంగతి తెలిసిందే. ఈసందర్బంగా ఇప్పుడు అందరి సందేహం ఒక్కటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ యాగానికి వస్తారా.. లేదా ఆని. అయితే కేసీఆర్ స్వయంగా విజయవాడ వెళ్లి చంద్రబాబును ఆహ్వానించడం.. తన యాగానికి తప్పకుండా వస్తానని చెప్పడంతో రేపు జరగబోయే యాగానికి చంద్రబాబు తప్పకుండా వస్తారని అర్ధమవుతోంది. అయితే ఇప్పుడు చంద్రబాబు కేసీఆర్ యాగానికి వెళ్లడం పట్ల టీ టీడీపీ నేతల్లో భిన్నాభిప్రాయాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ టీ టీడీపీ నేతలు కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అన్నట్టు వ్యవహరిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో చంద్రబాబు కనుక యాగానికి వస్తే అది పార్టీ కార్యకర్తలకు వేరే సిగ్నల్స్ ఇచ్చినట్టు ఉంటుదని.. కేసీఆర్ ను.. కాని ఆపార్టీ నేతలను విమర్శించడం ఎలా తలలుపట్టుకొనే పరిస్థితి వచ్చిపడింది. అయితే అందరి సంగతి ఎలా ఉన్నా టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మాత్రం అవేమి పట్టించుకోకుండా కేసీఆర్ ను ప్రెస్ మీట్ పెట్టి విమర్శిస్తూనే ఉన్నారు.
మరోవైపు కేసీఆర్ కూడా గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో సెటిలర్ల ఓట్ల కోసమే చంద్రబాబుతో మంచిగా ఉంటున్నారని అంటున్నారు. అందుకే ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. మరి ఇలాంటి సమయంలో చంద్రబాబు ప్రచారంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. నేతలను ఎలా దిశా నిర్దేశికం చేస్తారో చూడాలని కొంతమంది టీడీపీ నాయకులు చర్చించుకుంటున్నారు. అయితే ఈ గ్రేటర్ ఎన్నికల్లో సెటిలర్ల ఓట్లు ఎంత ముఖ్యమో అలాగే తెలంగాణ ఓట్లు కూడా కావాలి. అందుకే ఈ యాగానికి వెళ్లే తెలంగాణ ప్రజలకు తనపై నమ్మకం కలుగుతుందనే భావనతో చంద్రబాబు ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి ఈ యాగానికి వెళ్లడం వల్ల చంద్రబాబుకి ఎంత ప్రయోజనం ఉంటుంది.. తన ప్లాన్ ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి.