హైదరాబాద్ అభివృద్ధి కోసం టీడీపీకి ఓటేయండి: చంద్రబాబు ట్వీట్
posted on Nov 30, 2020 @ 11:12AM
హైదరాబాద్ కు పూర్వ వైభవం రావాలంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని .. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు.
బిల్‌గేట్స్, బిల్ క్లింటన్‌లను నగరానికి తీసుకువచ్చి ఐటీ కంపెనీలను స్థాపించిన ఘనత తమదేనని టీడీపీదేనని చెప్పారు, నగరం సర్వతోముఖాభివృద్ధి జరగాలంటే టీడీపీ అభ్యర్థులకు ఓటువేసి గెలిపించాలని గ్రేటర్ ఓటర్లను ఆయన ట్విటర్‌లో కోరారు. ప్రజాశ్రేయస్సు పట్ల తమకున్న ఆకాంక్షల ఫలితమే సైబరాబాద్ అన్నారు చంద్రబాబు. హైటెక్‌సిటీ, ఔటర్ రింగ్‌రోడ్, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, జినోమ్ వ్యాలీ.. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తమ హయాంలోనే ప్రారంభమయ్యాయని తెలిపారు. ఉపాధి కల్పన, సంపదసృష్టి, సంక్షేమం లక్ష్యంగా ముందుకు సాగి ఎన్నో కుటుంబాల్లో వెలుగునింపామన్నారు చంద్రబాబు. మళ్లీ హైదరాబాద్ నగరానికి పూర్వవైభవం రావాలంటే ప్రజలు సైకిల్ గుర్తుకు ఓటేసి, టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ట్విటర్‌లో కోరారు.