అడవుల్ని సైతం వదలడం లేదు! మడ అడవుల్ని జగన్ నుంచి కాపాడండి! చంద్రబాబు పిలుపు
posted on May 12, 2020 @ 10:39AM
మడ అడవులను వైసీపీ ప్రభుత్వం ఎలా నరికేసి, మట్టి నింపేస్తుందో చూడంటూ చంద్రబాబునాయుడు పోస్టు పెట్టారు.
ఐక్యరాజ్య సమితి సైతం కోరింగ మడ అడవులను గుర్తించింది. కాకినాడకు రక్షణ కవచం లాంటివి మడ అడవులు.
ఇలా నరికేస్తే రేపు తుపానులొచ్చినప్పుడు ప్రజల సంగతి ఏంటీ?
ఇలాంటి చోట ఇళ్లు కట్టుకుంటే ఆ పేదలకు రక్షణ ఏంటి?
తూర్పు గోదావరి జిల్లాలోని మడ అడవులను నరికివేయిస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అప్పట్లో ఆ అడవులు ఎలా ఉండేవో, నరికివేతతో అక్కడి ప్రాంతం ఎలా మారిపోయిందో తెలుపుతున్న ఫొటోలను ఆయన పోస్ట్ చేశారు. 'ఐక్యరాజ్య సమితి సైతం గుర్తించిన కోరింగ మడ అడవులను వైసీపీ ప్రభుత్వం ఎలా నరికేసి, మట్టి నింపేస్తుందో చూడండి. ఇలాంటి చోట ఇళ్లు కట్టుకుంటే ఆ పేదలకు రక్షణ ఏంటి?' అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. మడ అడవులను జగన్ నుంచి కాపాడాలంటూ హ్యాష్ ట్యాగ్ జోడించారు.