రాష్ట్రపతితో చంద్రబాబు భేటీ
posted on Feb 4, 2014 @ 11:32AM
రాష్ట్ర విభజన అంశం కీలక దశకు చేరుకోవడంతో రాష్ట్ర రాజకీయ వర్గాలన్నీ ఢిల్లీలోనే మకాం వేశాయి. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని అతిక్రమిస్తూ రాష్ట్రాన్ని విభజిస్తోందని నినదిస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో హల్‌చల్ చేస్తున్నారు. శరద్ యాదవ్ లాంటి పలువురు జాతీయ నాయకులను కలసి సమసపై వారికి పూర్తి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. అలాగే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో మంగళవారం రాత్రి ఏడున్నర గంటలకు చంద్రబాబు భేటీ అయ్యారు. అరగంట పాటు ఆయనతో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు రాజ్యాంగ వ్యతిరేకంగా వుందంటూ రాసిన ఓ పుస్తకాన్ని ఆయన రాష్ట్రపతికి ఈ సందర్భంగా అందజేశారు. అలాగే ఓ వినతిపత్రాన్ని కూడా సమర్పించారు. రాష్ట్ర విభజన అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎలా ఒక ప్రహసనంలా మార్చిందన్న విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు రాష్ట్రపతికి వివరించినట్టు తెలిసింది.