"టైమ్స్ నౌ" సర్వేపై చంద్రబాబు స్పందన
posted on Apr 17, 2013 9:16AM
రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై టైమ్స్ నౌ అనే ఆంగ్ల ఛానల్ సర్వేపై చంద్రబాబు ఇలా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం ముమ్మాటికీ తెలుగుదేశం పార్టీయేనని, వైఎస్సార్సీపీ కి ఏడాది క్రితం 30 లోక్ సభ సీట్లు వస్తాయని సర్వేలో తేలిందని, ఇప్పుడు తాజాగా జరిపిన సర్వేలో 12 సీట్లే వస్తాయని, ఇంకో ఏడాది దాటితే ఒక్క సీటు కూడా రాదని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా వుండేవి, రాష్ట్రంలో పరిపాలన ఎలా వుండేది, విద్యారంగంలో కొత్త మార్పులు వచ్చాయి, రోడ్లు, వైద్యం, తాగునీరు, విద్యుత్ తదితర అంశాల్లో ఎలా చేశాం అన్న విషయాల్ని ప్రజలు గమనిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ గత తొమ్మిదేళ్ళ పాలనలో వ్యవస్థలను ఎలా నాశనం చేసిందీ ప్రజలకు తెలుసునని, రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పథంలో నడవాలంటే అన్ని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలియజేశారు.