అభివృద్ధి కోసం కష్టపడాలి: బాబు పిలుపు
posted on May 27, 2014 @ 3:52PM
కష్టకాలంలో కష్టపడి పనిచేయాలి, ప్రతికూల పరిస్థితులను ప్రజా శ్రేయస్సుకు అనుగుణంగా మార్చుకోవాలి అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పిలుపు ఇచ్చారు. ప్రస్తుతం సీమాంధ్రలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని, అలాగే తెలంగాణాలో సామాజిక న్యాయాన్ని సాధించవలసిన అవసరం ఉన్నదని ఆయన గుర్తు చేశారు. ఈ 32 ఏళ్లలో అనేక దేశంలో ఎన్నో మార్పులు వచ్చాయి, మనం జాతీయ పార్టీగా మారుతున్నాం అంటూ ప్రతి ఒక్కరం మరింత దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని ఆయన పిలుపు ఇచ్చారు. ప్రజలు మన మీద ఆశలు పెట్టుకున్నారు, రాష్ట్ర సమస్యల పరిష్కారంకోసం మనం రాష్ట్రాన్ని అభివృద్ధిపధంలోకి తీసుకువెళ్లాలని ఆయన అన్నారు. సంక్షోభాలను మనం ఒక అద్భుత అవకాశంగా తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అభివృద్ధికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చుదిద్దుదాం, యువతకు మంచి భవితను ఇద్దాం, ఇదే ఇప్పుడు మన అందరి తక్షణ కర్తవ్యం అని చంద్రబాబు దిశానిర్దేశనం చేశారు.