చంద్రబాబు మూడు సంతకాల ముచ్చట్లు
posted on Jun 7, 2014 @ 6:54PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి పీఠం మీద మరోసారి నారా చంద్రబాబునాయుడు కూర్చోబోతున్నారు. ఆదివారం సాయంత్రం గుంటూరు సమీపంలో జరిగే ఒక భారీ కార్యక్రమంలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన మూడు ఫైళ్ళ మీద సంతకాలు చేయనున్నారు. ఆ మూడు ఫైళ్ళ ముచ్చట్లు ఇవి.. ఆదివారం సాయంత్రం 7.27 నిమిషాలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు రాత్రి 8.35 నిమిషాలకు తన మొదటి సంతకాన్ని చేయనున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా తన మొదటి సంతకాన్ని రైతు, డ్వాక్రా రుణమాఫీ ఆదేశాల పైల్ మీద చేయనున్నారు. రెండో సంతకాన్ని ఆంధ్రప్రదేశ్‌లో బెల్టు షాపులను రద్దుచేసే ఆదేశాల మీద చేయనున్నారు. ముచ్చటగా మూడో సంతకాన్ని ఎన్టీఆర్ సుజల పథకం కింద అన్ని గ్రామాలకూ తాగునీరు ఇచ్చే ఆదేశాల మీద సంతకం చేయనున్నారు. ఇలా మూడు ముఖ్యమైన సంతకాలకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవ వేదిక సాక్షిగా నిలవనుంది.