అమ్మవారిని దర్శించుకున్న చంద్రబాబు, సిఎం కిరణ్
posted on Jul 8, 2012 @ 4:50PM
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదివారం ఉదయం లష్కర్ బోనాల జాతరకు విచ్చేశారు. ఉజ్జయినీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. మరోవైపు వివిఐపిలు కూడా అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. అయితే సిఎం కాన్వాయ్‌ని చూడగానే భక్తులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.సిఎం రావడంతో భక్తులకు దర్శనాన్ని నిలిపివేశారు. దీంతో భక్తులు సిఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కిరణ్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం కూడా వెనుదిరిగి వచ్చే సమయంలో మరోసారి సిఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. హైదరాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ బండ కార్తిక రెడ్డి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ, పెద్దపల్లి ఎంపి వివేక్ కుటుంబ సభ్యులు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఆ పార్టీ నేత ఇంద్రసేనా రెడ్డి, సికింద్రాబాద్ ఎంపి అంజన్ కుమార్ యాదవ్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.