విజయవాడ వాసులకు చంద్రబాబు చురకలు..
posted on Jan 27, 2016 @ 10:40AM
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ వాసులకు చాలా సింపుల్ గా.. నవ్వుతూనే చురకలు అంటించినట్టు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో విజయవాడలోని అద్దెలు బాగా పెరిగిపోయాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని చంద్రబాబు కూడా ప్రస్తావించి.. తాను హైదరాబాద్ లో ఉన్న సచివాలయ ఉద్యోగుల్ని విజయవాడకు రమ్మని చెప్పానని.. దీనికి వారు బెజవాడలో అద్దెలు హైదరాబాద్ కంటే ఎక్కువగా ఉన్నాయని చెప్పారని.. కాస్ట్ ఆఫ్ లివింగ్ భారీగా ఉందని చెప్పినట్లుగా వెల్లడించారు. అంతేకాదు కాస్త వెటకారంగా మహానగరాల్లో పక్కింటి గురించి పట్టించుకోరని..కానీ బెజవాడలో మాత్రం పక్కింటి వ్యవహారాలు పట్టించుకుంటారంటూ చురకలు అంటించారు. మన రాజధాని అమరావతి అభివృద్ధి చెందడానికి కొంచెం సమయం పడుతుంది.. అప్పటిలోపు చిన్న చిన్న విషయాల్లో సర్దుకుపోవాలి.. పెద్ద మనసు చేసుకోవాలని హితవు పలికారు. మరి చంద్రబాబు మాటలని ప్రజలు వంటపట్టించుకుంటారా.. అద్దెలు తగ్గిస్తారా.. చూడాలి మరి..