ఢిల్లీలో బాబు బిజీ: జైట్లీతో ఏపీ రాయితీలపై చర్చ
posted on May 30, 2014 @ 1:19PM
టిడిపి అధ్యక్షుడు, సీమాంధ్రకు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆప్రాంత అభివృద్ధి కోసం చేయాల్సిన కార్యాచరణలో అప్పుడే నిమగ్నమయ్యారు. సీమాంధ్ర పునర్నిర్మాణం కోసం కావల్సిన నిధులు, రాష్ట్రానికి కేంద్రం నుంచి రావల్సిన రాయితీల చిట్టాలతో ఢిల్లీ వెళ్ళిన బాబు ముందుగా కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి అరుణ జైట్లీతో భేటి అయ్యారు. ఈ సమావేశంలో బాబు జైట్లీని ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన రాయితీలపై స్పష్టత ఇవ్వలని కోరారు. సీమాంధ్రకు ఉత్తరాఖండ్ తరహా ప్యాకేజ్ కూడా ఇవ్వాలని కోరారు. సీమాంధ్రకు ఆర్థిక సాయానికి సంబంధించిన వ్యవహారాలపై ప్రణాళికా సంఘం ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించిందని జైట్లీ తెలిపారు. రాష్ట్ర విభజన బిల్లు ప్రకారం సీమాంధ్రకు ఆర్థికంగా మద్దతు ఇస్తామని ఆయన తెలిపారు. సీమాంధ్రను పునర్ నిర్మించాల్సిన అవసరం ఉందని కూడా జైట్లీ చెప్పారు. ఈ రోజంతా వరుస భేటీలతో ఢిల్లీలో చంద్రబాబు బిజీబిజీగా గడపబోతున్నారు.